ఈ రోజు నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ అధినేత, మాజీ సిఎం జగన్ తెలిపారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని చెప్పారు. అలాగే 2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కి తీసుకుంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

