టాలీవుడ్‌లో పేరుగాంచిన నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
అసలుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వేదరాజు, సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అల్లరి నరేశ్ హీరోగా నటించిన మడత కాజా మరియు సంఘర్షణ చిత్రాలను నిర్మించారు. ఇక మరో కొత్త సినిమాను ప్లాన్ చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా మరణించడం సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.

