లవ్ బ్రేకప్ అనుభవం ఉన్నవారికి ప్రత్యేక ఉద్యోగ అవకాశం కల్పిస్తూ బెంగళూరులోని Topmate కంపెనీ ఆసక్తికర ఆఫర్ ఇచ్చింది. ఈ మెంటరింగ్ & కన్సల్టింగ్ సంస్థ “చీఫ్ డేటింగ్ ఆఫీసర్” పోస్టుకు ఉద్యోగులను నియమించేందుకు విభిన్న అర్హతలు పేర్కొంది. అభ్యర్థులు కనీసం మూడు డేట్స్, రెండు సిట్యుయేషన్షిప్లు, ఒక లవ్ బ్రేకప్ అనుభవం కలిగి ఉండాలి. అలాగే, డేటింగ్ యాప్స్ వాడి ఉండటం, డేటింగ్ టర్మ్స్ గురించి అవగాహన ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల ప్రేమ కథలు వింటామని కంపెనీ తెలిపింది కానీ ఆధారాలు అడగబోమని స్పష్టం చేసింది. ఈ వినూత్న ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

