స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, ప్రధాన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,155 పాయింట్లు (+130), 76,404 పాయింట్లు (+566) వద్ద ముగిశాయి. ముఖ్యంగా IT, ఫార్మా, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాల షేర్లు మద్దతు పొందగా, రియాల్టీ రంగం నష్టపోయింది. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్‌లో ఈ రిలీఫ్ ర్యాలీ ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

