ఆంధ్రప్రదేశ్ బృందం దావోస్‌లో పర్యటన కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
సమర్థమైన పవర్ ట్రాన్స్‌మిషన్‌కు హెచ్‌వీడీసీ టెక్నాలజీ:
లోకేశ్, రాష్ట్రంలో సమర్థమైన పవర్ ట్రాన్స్‌మిషన్ కోసం హెచ్‌వీడీసీ తరహా సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు హిటాచీ సహకరించాలని కోరారు. అంతేకాక, కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ప్లాన్ చేసిన 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై త్వరలో చర్యలు చేపడతామని భరత్ కౌశల్ హామీ ఇచ్చారు.
హెల్త్‌కేర్ టెక్నాలజీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్:
డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను హెల్త్‌కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు సహకారం అందించాల్సిందిగా కోరారు. శ్యామ్ బిషన్, “మెడిసిన్ ఫ్రం ద స్కై” కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు. ఏఐతో ఆరోగ్య సేవల అభివృద్ధి అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

