ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “గేమ్ ఛేంజర్” సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరకు అదనంగా 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరకు 135 రూపాయలు అదనంగా చార్జ్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.

