అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘శివ శక్తి’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని మొదటి పాట ‘బుజ్జితల్లి’ ఇప్పటికే హిట్‌గా నిలిచింది. ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.https://youtu.be/tSNs6it31WA?si=m1VwKn2ZuV0hCg0o

