రాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహణ
కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామం, లంబాడి తండా వాసులకు క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంటికి ఒక సోలాపూర్ చెద్దరును రాంపల్లి శ్రీనివాస్ అందించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ తన పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ చలికాలంలో గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా సోలాపూర్ నుండి ప్రత్యేకంగా 1200 చెద్దరులు తెప్పించి, కులమతాలకు అతీతంగా బుధ, గురువారం రెండు రోజుల పాటు ప్రతీ ఇంటికి తిరిగి స్వయంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి గ్రామస్థుల నుండి విశేషమైన స్పందన లభించింది. శ్రీనివాస్ చేసిన సేవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలికట్టె సోమన్న, మిట్టపెల్లి వీరాస్వామి, బేతోజు బ్రహ్మచారి, రాంపల్లి పాపయ్య, దుదిగాని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

