దర్శకుడు: వెట్రి మారన్
నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కన్నడ కిషోర్, తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్ వెల్ రాజ్
ఎడిటింగ్: ఆర్ రామర్
సంగీతం: ఇళయరాజా
నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, రామారావు చింతపల్లి
బ్యానర్: ఆర్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, శ్రీ వేధాక్షర మూవీస్
రిలీజ్ తేదీ: 2024 డిసెంబర్ 20
రివ్యూ :
“విడుదల 2” ఒక క్రూరమైన సమాజంలో మార్పు సాధించడానికి తపనపడే వామపక్ష ఆలోచనలతో కూడిన కథను చెప్పే చిత్రం. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన పెరుమాళ్ (విజయ్ సేతుపతి), సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు పోరాడే నాయకుడు. పోలీసులు అతన్ని అక్రమంగా అదుపులోకి తీసుకుని తీవ్ర శారీరక హింసకు గురి చేస్తారు, కానీ పెరుమాళ్ తన నిర్బంధం నుండి తప్పించుకుంటాడు. ఆయన జీవితంలో వచ్చే ప్రధాన అనుమానాలు, వివాహ జీవితం, నక్సలైట్ ఉద్యమంలో చేరడంలో తగిన ప్రభావం, మరియు రైలు ప్రమాదం వెనుక ఉన్న వాస్తవం ఈ సినిమాకి కీలకాంశాలు.
ఈ చిత్ర కథ “విడుదల 1″లో విజయ్ సేతుపతి అరెస్టుతో ముగిసింది. “విడుదల 2” లో, ఆ కథ కొనసాగుతూ భావోద్వేగపూరిత సన్నివేశాలతో మొదలై, ఒక్కసారి పెరుమాళ్ జీవితం మీద క్లారిటీ వచ్చిన తర్వాత కథలో వేగం తగ్గుతుంది. మొదటి భాగంలో కొన్ని భావోద్వేగానికి కారణమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, రెండో భాగంలో యాక్షన్‌కు సంబంధించిన కీలక అంశాలు ముందుకు వస్తాయి. ఇందులో ఎన్‌కౌంటర్ల, ప్రజా దళం ఉద్యమం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.
నటీనటులు:
విజయ్ సేతుపతి తన పాత్ర పెరుమాళ్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ , గెటప్, భావోద్వేగం ప్రతి సన్నివేశంలో పెరుమాళ్ పాత్రను మరింత సజీవం చేసింది. ఆయన నటన ఈ సినిమాలో బలంగా నిలిచింది. మంజు వారియర్ కూడా తన పాత్రలో హుందాగా పర్ఫెక్ట్‌గా నటించారు. ఆమె గ్లామర్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కోసం అదనంగా ఆకట్టుకుంది. కన్నడ కిషోర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూరి వంటి ఇతర నటులు తమ పాత్రల మేర నటించారు.
సాంకేతిక అంశాలు:
ఇళయరాజా మ్యూజిక్, ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరింత ఉత్కంఠను రేపింది. రామారావు చింతపల్లి, ఎల్ రెడ్ కుమార్ నిర్మాణం బాగుంది. ఆర్ వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా సాగింది, ముఖ్యంగా ఫారెస్ట్ సన్నివేశాలు మరియు యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ ఆకట్టుకొంటాయి.
దర్శకత్వం & స్క్రీన్ ప్లే:
వెట్రి మారన్ దృష్టి, కథనం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, మొదటి సగం కొంత లాగ్ అయ్యింది. అయితే, రెండో సగంలో యాక్షన్ సన్నివేశాలు, ఎన్‌కౌంటర్లు, క్లైమాక్స్ విషయంలో అతని టేకింగ్ మిక్కి హైప్ క్రియేట్ చేసింది. ఆయన ధైర్యంగా సామాజిక అంశాలను స్పురిస్తూ, చిత్రాన్ని చక్కగా డీల్ చేశారు.
ప్రేక్షకుడి అంచనా :
“విడుదల 2” ఒక అద్భుతమైన ఎమోషనల్, యాక్షన్ డ్రామా. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ రాసిన , డైలాగ్ లైన్లు, మొదటి సన్నివేశం, క్లైమాక్స్ సినిమాకు మరింత హైలైట్ చేశాయి. మొదటి అర్ధంలో కొంత లాగ్ ఉన్నప్పటికీ, రెండో అర్ధం ఎమోషనల్, యాక్షన్ అంశాలతో ప్రాణం పొంది, క్లైమాక్స్ అదిరిపోయింది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్, వామపక్ష భావజాలంతో సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 3.75/5

