‘అడుగు’ అంటావు!
ఏమి‘అడుగు’మంటావు?
‘అడుగు’లో అడుగేసి నడిసినావని…
‘అడుగు’న తొక్కేసారు!
అడవిలో వదిలేశారు!!
‘అడుగు’లకు మడుగులొత్తే వారినే…
లోకంలో అడగ’నిస్తున్నారు
‘తప్పటడుగు’లున్నా సరే
డబ్బు గొడుగులుంటే సరి
కరిగి పోతాయి మరకలన్నీ
నువ్వైతే ‘అడుగు’తూనే వుండు…
పిడుగులాంటి అక్షరాలను సంధించి…
పెన్ను ఫిరంగుల ద్వారా ‘అడుగు’తూనే వుండు
బానిస భావాల తొడుగులను వదిలిస్తూ…
బడుగుల కొరకై కడుగుతూనే వుండు…
‘అడుగు’లో ‘అడుగు’ వేస్తూనే వుండు…

