భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రైల్వే శాఖ (Indian Railways) మరో కీలక అడుగు వేసింది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,115 రైల్వే స్టేషన్ల లో ప్రయాణికులకు హై స్పీడ్ గల వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కాచిగూడ, సికింద్రాబాద్ సహా అనేక రైల్వే స్టేషన్ల లో ఈ వైఫై సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రైల్వే సౌకర్యాలపై రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఈ హై స్పీడ్ వైఫై సదుపాయంతో ప్రయాణికులు తమ ఫోన్ల లో సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అత్యవసర సమయాల్లో స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చన్నారు. రైల్వే సహకార సంస్థ రైల్ టేల్ సహకారంతో ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు.
- రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై (Wi-Fi) సదుపాయాన్ని పొందడం ఎలా?
- ప్రయాణికులు స్మార్ట్ ఫోన్లలో ముందుగా వైఫై మోడ్ (Wi-Fi MODE) ను ఆన్ చేయాలి
- ఆప్షన్లలో రైల్ వైర్ వైఫై (Rail Wire Wi-Fi నెట్ వర్క్ ను ఎంచుకోవాలి.
- అందులో మీ ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి
- ఎస్ఎంఎస్ (SMS) ద్వారా ఫోన్ కు వన్- టైం పాస్ వర్డ్ (OTP) వస్తుంది
- ఫోన్ కి వచ్చిన ఓటిపిని నమోదు చేస్తే హైస్పీడ్ వైఫై కనెక్ట్ అవుతుంది

