Monday, March 30, 2026
35.2 C
Hyderabad

AMITH SHAH|అమిత్ జీ… అంతొద్దు!

షా మాటలు DEMOCRACY| ప్రజాస్వామ్యంపై తూటాలు
TELANGANA|  తెలంగాణలో GUN DOWN| కాల్పుల విరమణ ప్రకటించాలి
PEACE| శాంతి చర్చలకు GOVERNMENT| ప్రభుత్వాలు సిద్ధం కావాలి
RELEASE| విడుదల చేసిన LETTER| లేఖలో MAOIST CENTRAL COMMITTEE| మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్‌తోనైనా చర్చలు జరుపుతామని చెప్పే ప్రభుత్వం, దేశీయ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో మాత్రం చర్చలకు సిద్ధంగా లేదనడం అన్యాయమన్నారు. అలాగే తెలంగాణలో కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూన్ 29న నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా చేసిన మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నది, 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభయ్ పేర్కొన్నారు. మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వస్తున్నారని, వారికి, బలగాలతో కలసి చర్చలు జరిపేందుకు మానవీయమైన దృష్టితో చూడాలని చెప్పారు.

మావోయిస్టు పార్టీ ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నదని, మార్చి 28న తెలంగాణలో భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కాల్పుల విరమణ ప్రకటించామని గుర్తు చేశారు. అయినప్పటికీ, కేంద్ర బలగాలు దాడులు ఆపడం లేదన్నారు. కాల్పుల విరమణ చేసినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో 85 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్(హత్య) చేశారని, అందులో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు నేతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇది కేవలం మావోయిస్టులను మట్టుబెట్టే ప్రయత్నం మాత్రమే కాదని, వేలాది ఆదివాసీల భూములను లాక్కొనే కుట్ర కూడా అని అభయ్ ఆరోపించారు. గడ్చిరోలీలో లక్షకు పైగా చెట్లు నరికి కార్పొరేట్ లాభాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందన్నారు.

ఇకపోతే దేశవ్యాప్తంగా మేధావులు, హక్కుల కార్యకర్తలు, శాంతి ప్రేమికులు చర్చలకు మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ శాంతి చర్చల కమిటీ నేతలు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ ముఖ్యమంత్రిని కలసి చర్చల మార్గాన్ని సూచించినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించలేదన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటే రాష్ట్రమే ముందుగా ఆ వాతావరణం సృష్టించాలి అని సూచించారు. అమిత్ షా ప్రకటనలను ఖండించిన కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను అభయ్ స్వాగతించారు. మావోయిస్టులు కూడా భారత పౌరులేనని, వారితో చర్చల కోసం ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు.

ఆదివాసీల హక్కులు, వారి భూములు, అడవులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని, వామపక్షాలు, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు కలసి ఉద్యమాన్ని కొనసాగించాలని అభయ్ పిలుపునిచ్చారు.

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News