దేశ వ్యాప్తంగా సంవత్సరానికి ఏ ఆలయానికి ఎంత ఆదాయం వస్తుందో చూసుకుంటే ఏ ఆలయం ముందంజలో ఉందో తెలుస్తుంది. మొదటి పది స్థానాల్లో ఏ ఆలయం వుందో మనం ఒక్కసారి చూద్దాం.
అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600 కోట్లు, రెండవ స్థానంలో కేరళ రాష్ట్రంలోని పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800 కోట్లు, ఉత్తర ప్రదేశ్ లో అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700 కోట్లతో మూడవ స్థానం, పంజాబ్ రాష్ట్రంలో స్వర్ణ మందిరానికి రూ.650 కోట్లతో 4వ స్థానం వుండగా, 5వ స్థానంలో జమ్మూ రాష్ట్రంలోని వైష్ణోదేవీ గుడికి రూ.600కోట్లతో వుంది. ఆ తరువాత 7వ స్థానంలో షిర్డీ సాయి మందిరానికి రూ.500 కోట్లతో వుండగా, 8వ స్థానంలో ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి గుడికి రూ.400 కోట్లతో, 9వ స్థానంలో ఢిల్లీ రాష్ట్రంలో అక్షర్గామ్ ఆలయానికి రూ.200-250 కోట్లతో, చిట్ట చివరి 10వ స్థానంలో గుజరాత్ సోమనాథ్ మందిరానికి రూ.150-200 కోట్ల ఆదాయంతో వుందని సమాచారం.

