ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. మొత్తం 36 స్థానాల్లో విజయఢంకా మ్రోగించిన బీజేపీ, మరో 11 చోట్ల ముందంజలో ఉంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 19 స్థానాల్లో విజయం సాధించగా, 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలతో ఢిల్లీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.

