దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి ఆతీశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురిని ఓడించి మరోసారి తన పట్టును చాటుకున్నారు. మరోవైపు, ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ షకుర్ బస్తీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. షాలిమార్ బాగ్ నుంచి బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తా 29,595 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంతలో, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ తన విజయ ధృవీకరణ పత్రాన్ని స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. కొన్ని చోట్ల ఆప్ మెరుగైన ప్రదర్శన చేయగా, మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.

