ఆందోళన వ్యక్తం చేస్తున్న సంప్రదాయ వాదులు
ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) దగ్గర పడుతుండడంతో వాలెంటైన్ వీక్ సందడి మొదలైంది. ప్రేమికులు తమ అనుబంధానికి గుర్తుగా ఫిబ్రవరి 7 నుంచి రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే వంటి ప్రత్యేక రోజుల్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో, వెస్ట్ బెంగాల్‌లోని మక్రేపారా ప్లే గ్రౌండ్‌లో ‘లిప్ కిస్ కాంపిటీషన్’ నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని, ముఖ్యంగా ఒంటరిగా వెళ్లేవారికి ప్రవేశం లేదని తెలుస్తోంది. 15 ఏళ్ల నుండి 90 ఏళ్ల వరకు అందరూ పాల్గొనవచ్చని, తమ భాగస్వామిని వెంట తీసుకొని రావాల్సిన అవసరం ఉందని షరతులు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోటీ జరుగుతుందని ప్రచారంలో ఉంది.
ఇలాంటి పోటీలు సాధారణంగా విదేశాల్లోనే జరుగుతాయని భావించేవారు, కానీ ఇప్పుడు భారతదేశంలోనూ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోటీపై అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేకపోయినా, ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్ పత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది వాస్తవమా లేక ప్రచారమేనా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు, కానీ ఈ పోటీ గురించి చర్చ జోరుగా సాగుతోంది.
ఆందోళన వ్యక్తం చేస్తున్న సంప్రదాయ వాదులు
ఈ కార్యక్రమం ప్రచారాన్ని చూసిన సంప్రదాయ వాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డుకోవడానికి మేము వెనుకడబోమని అంటున్నారు

