ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ఆయన క్యాంపెయినింగ్ చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.

