బంగారం ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటూ వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎంసీఎక్స్లో బుధవారం 10 గ్రాముల పసిడి ధర ఫ్యూచర్స్ ట్రేడింగ్ సమయంలో రూ. 83,750 స్థాయిని తాకింది. కొనుగోలుదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ వల్లే ఈ తాజా పెరుగుదల సంభవించినట్లు నిపుణులు భావిస్తున్నారు.
22 క్యారెట్ల బంగారం ధరలు
గత రోజుతో పోల్చితే 100 గ్రాములకు రూ. 1,500 పెరిగింది. ప్రముఖ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు (గ్రామ్‌కు):
చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ – రూ. 7,610
దిల్లీ, జైపూర్, లక్నో, గురుగ్రామ్, నోయిడా, అయోధ్య – రూ. 7,625
వడోదర – రూ. 7,615
నాశిక్ – రూ. 7,613
24 క్యారెట్ల బంగారం ధరలు
24 క్యారెట్ల బంగారం కూడా గణనీయంగా పెరిగి 100 గ్రాములకు రూ. 1,700 పెరిగింది. ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు (గ్రామ్‌కు):
చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ – రూ. 8,302
దిల్లీ, జైపూర్, లక్నో, గురుగ్రామ్, నోయిడా, అయోధ్య – రూ. 8,317
వడోదర – రూ. 8,307
నాశిక్ – రూ. 8,305
బడ్జెట్ ప్రభావం
గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించడంతో వినియోగం పెరిగింది. అయితే, దేశంలో దిగుమతులు పెరిగి ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈసారి బడ్జెట్‌లో పసిడి దిగుమతులపై పన్నులను పెంచవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, డాలర్ బలపడటం, రూపాయి విలువ తగ్గడం కూడా ఆర్థిక మాంద్య భయాలకు కారణంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ బంగారం, వెండి ధరలు
తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,610 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,302 వద్ద కొనసాగుతోంది.
వెండి ధర:
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీకి రూ. 2,000 పెరిగి, ప్రస్తుతం రూ. 1,06,000 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

