ఛత్తీస్ గఢ్-ఒడిశా బోర్డర్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు 16 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు కోబ్రా మిలిటెంట్స్, మావోయిస్టులు, సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

