భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం, ప్రైవేట్ రంగ బ్యాంకులలో అట్రిషన్ రేటు సగటున 25 శాతానికి పెరిగింది. ఇది బ్యాంకుల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ రేటు గణనీయంగా ఉంది. అట్రిషన్ రేటు పెరగడం వల్ల కస్టమర్ సర్వీసులో ఇబ్బందులు, నియామక ఖర్చుల పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని తగ్గించేందుకు మెరుగైన ట్రైనింగ్, కెరీర్ అవకాశాలు, మెంటార్షిప్ ప్రోగ్రామ్లు అనుసరించాలని ఆర్బీఐ సూచించింది. అంతేకాకుండా, బంగారు రుణాల పరిశీలన, ఔట్సోర్సింగ్ నియంత్రణ పట్ల ప్రైవేట్ బ్యాంకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆర్బీఐ హితవు పలికింది.

