ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. 12 మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గరియాబంద్ ఎస్పీ తెలిపారు. నిన్న గరియాబంద్ డీఆర్, ఒడిశా ఎస్వోజీ దళాలు కూంబింగ్ నిర్వహించాయని, తమ సిబ్బందిలో ఒకరు కాల్పుల్లో గాయపడ్డారని పేర్కొన్నారు.

