జనగామ జిల్లాలో కొడకండ్ల మండలం, గిర్ని తండా వద్ద జనగామ-సూర్యపేట ప్రధాన రహదారిపై అర్ధరాత్రి డీసీఎం వాహనం, తూఫాన్ వాహనం ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు సూర్యపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల జ్యోతి, పేరాల వెంకన్న అనే భార్యాభర్తలుగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన. స్థానికంగా విషాదాన్ని కలిగించింది.

