కర్ణాటకలోని మధుగిరిలో డీవైఎస్పీ రామచంద్రప్పపై అనుచిత ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదు కోసం కార్యాలయానికి వచ్చిన ఓ మహిళను ప్రైవేట్ గదికి తీసుకెళ్లి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను మహిళతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియోలో రికార్డు చేశాడు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీవైఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన పోలీసు వ్యవస్థలో బాధితుల భద్రతపై సందేహం కలుగుతుంది.

