ప్రముఖ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో మృతిచెందారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇటీవలే విజయ రంగరాజు ఓ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమా ద్వారా గుర్తింపు పొందిన ఆయన, యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్ప్రెస్, మేడం వంటి అనేక చిత్రాల్లో నటించారు. విజయ రంగరాజు అకాలమరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.

