ఈ ఏడాది దేశంలోనే టాప్ సాంగ్ గా ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ సంచలనం రేపుతోంది. ఈ పాట 527 మిలియన్ల వ్యూస్ సాధించి, అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డులు సృష్టించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను దేశంలో అత్యధిక విజయం సాధించిన పాటగా పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల డాన్స్ స్టెప్పులు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలను అందుకున్నాయి. పాటలోని విజువల్స్, లిరిక్స్, డ్యాన్సు కంటే మ్యూజిక్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ పాటకు సామాన్య ప్రేక్షకుల దృష్టిలో కూడా మంచి స్పందన వచ్చింది. కాగా, ‘గుంటూరు కారం’ సినిమా ఈ నెల 31న కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో రీరిలీజ్ కానుంది, దీంతో పాటకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.

