నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “తండేల్” సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ప్రేక్షకుల నుంచి అపారమైన స్పందన అందుకుంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రంలో నాగ చైతన్య నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయాన్ని పురస్కరించుకుని, అక్కినేని నాగార్జున భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. తండేల్ కోసం నాగ చైతన్య చేసిన కృషిని, అతను దాటి వచ్చిన పరిధులను గుర్తు చేస్తూ గర్వంగా ఉందన్నారు. చందూ మొండేటి దర్శకత్వం, సాయి పల్లవి నటన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం అని పేర్కొన్నారు. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ హృదయాలను కదిలించిందని, ఈ చిత్రం చైతన్య నటనలో మైలురాయి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

