ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అలాగే, ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాలు రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

