టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు నాల్గో జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మరియమ్మ హత్య కేసులో అక్టోబర్ 7న పీటీ వారెంట్‌పై రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 7న సుప్రీం కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. తాజా పరిణామాల్లో న్యాయవాది తానికొండ చిరంజీవి గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులతో సురేష్‌కు బెయిల్ మంజూరు చేసింది.

