టీటీడీకి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన ఓ భక్తుడు టీటీడీకి రూ. 6 కోట్లు విరాళంగా అందించారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఆదివారం టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానెల్ కోసం ఐదు కోట్ల రూపాయలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు వర్ధమాన్ జైన్ రూ. కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వర్దమాన్ జైన్ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. వర్ధమాన్ జైన్ టీటీడీకి విరాళం అందించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈయన విరాళాలు అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

