జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన వాస్తు నిపుణులు చిలుకమారి వాసుదేవ్ కు వాస్తు రత్న పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విశాఖపట్నంలో విశ్వ జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వైదిక జ్యోతిష సమ్మేళనంలో జ్యోతిష పెద్దల సమక్షంలో ఈ అవార్డును వాసుదేవ్ కు అందించారు. ఈ సందర్భంగా వాసు దేవ్ మాట్లాడుతూ…. తనకు ఈ అవార్డు రావడానికి కారణమైన తన గురువులకు, అందించిన ఆ సంస్థ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

