విశాఖపట్నం కారాగారంలోని నర్మదా బ్లాక్‌లో శుక్రవారం సెల్ఫోన్ దొరకడం కలకలం రేపింది. అందిన సమాచారంతో జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, భవనంలో గచ్చును తవ్వి, అందులో సెల్ఫోన్ దాచినట్లు గుర్తించారు. పైభాగంలో మార్బుల్ పలకతో కప్పి ఉంచినట్లు జైలు సూపరింటెండెంట్ మహేశ్‌బాబు తెలిపారు. ఆ సెల్ఫోన్‌లో సిమ్ కార్డ్ తొలగించినట్లు కనిపించింది. గంజాయి సరఫరా కేసులో నిందితుడైన ఓ ఖైదీపై అనుమానం ఉన్నట్లు స్పష్టం చేశారు.

