ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసారు. జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను పూర్తిగా తుడిచివేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం పై 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నాయని, ఈ ఆర్థిక పరిస్థితులపై ప్రతి నిమిషం బేరీజు వేసి పాలన సాగించాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏడు శాతం అప్పులతో జీతాలు చెల్లించే పరిస్థితి నెలకొన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కేశవ్, కాంట్రాక్టర్లే ఏపీకి ఆదాయం అందించే వారిగా పేర్కొంటూ, వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించిందని చెప్పారు. అలాగే, కొంత కాలంలో మరికొన్ని పథకాలు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
ఆర్ధిక శాఖ కింద పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే బిల్లులు చెల్లించబడుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని కంపెనీలకు ప్రాధాన్యతతో బిల్లులు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే 25 ఏళ్ల ఆదాయాన్ని తప్పుపట్టిందని, కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చే పంచాయతీ నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం పంచాయతీలకే కేంద్ర నిధులు పంపుతుందని, దీపావళి పండుగ సందర్భంగా కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు.

