సంఘటన జరిగిన విధానం తెలుసుకొని దోషులను కఠినంగా శిక్షించాలి అని అధికారులకు ఆదేశం
YSRCP నాయకుడు సుదర్శన్ రెడ్డి దాడి చేయగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జవహర్ బాబుకు అవసరమైన చికిత్స అందించడానికి పూర్తి బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాలివీడు ఎంపీడీఓ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సమయంలో వారికి తోడుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

