దిల్ రాజు కు అల్లు కుటుంబం బిగ్ షాక్
సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే, ఆ విమర్శల వల్ల అల్లు అర్జున్ కంటే ఎక్కువగా నిర్మాత దిల్ రాజు ఇబ్బందులు పడే అవకాశం కన్పిస్తుంది. ఈ అవకాశం రావడానికి గల కారణం దిల్ రాజు ఈ సంక్రాంతి టైంలో మూడు భారీ సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. వాటిలో ఒకటి పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి నిర్ణయం దిల్ రాజు సినిమాలకు పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించవచ్చు.
దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 న విడుదల కాబోతుంది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.250 కోట్లు బడ్జెట్ తో రూపొందింది. థియేట్రికల్ బిజినెస్ 500 కోట్లకు పైగా జరిగే అవకాశం ఉందని అంచనా. కానీ ఈ స్థాయిలో వసూళ్లు కావాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం.
ఇక, ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది. అలాగే, బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ఆయన భారీ లాభాలు పొందాలని ఆశిస్తున్నారు.
అయితే, రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, బెనిఫిట్ షోలకి మరియు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే, దిల్ రాజుకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి దిల్ రాజు ఆశలపై నీళ్ళు చల్లేలా ఉంది.

