శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
తిధి చవితి రాత్రి 07.20 వరకు ఉపరి
పంచమి
నక్షత్రం స్వాతి సాయంత్రం 05.25 వరకు
ఉపరి విశాఖ
యోగం వ్యాఘాత పగలు 02.25 వరకు
ఉపరి హర్షణ
కరణం బవ సాయంత్రం 05.51 వరకు
ఉపరి కౌలవ
వర్జ్యం రాత్రి 11.40 నుండి 01.24
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి రాత్రి 10.48 నుండి
11.36 వరకు
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24
మార్చి 18, 2025, మంగళవారం, రాశి ఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. రుణ బాధలు కొంత ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటారు.
వృషభ రాశి
భాగస్వామ్య వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా, మీరు వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. భూముల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలను కొంతవరకు తీరుస్తారు.
మిథున రాశి
వృత్తి, ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్ధి చెందుతాయి. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి.
కర్కాటక రాశి
శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రెండు మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, అవి మీకు ఉపకరిస్తాయి.
సింహ రాశి
ఉద్యోగులు కొంత సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ఇష్ట దైవ ప్రార్థన మేలు చేస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప జాగ్రత్తలు అవసరం.
కన్యా రాశి
కష్టపడి పని చేస్తారు, ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి. కుటుంబంతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు.
వ్యాపారులు జాగ్రత్తగా ఉండవలెను
తులా రాశి
అభీష్టం నెరవేరుతుంది, ఆర్థిక లాభం పొందుతారు. నూతన వస్తువులను కొంటారు. కీలక సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాల్య మిత్రులతో విందుకు వెళతారు.
వృశ్చిక రాశి
కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మిత్రుల వ్యక్తిగత విషయాల్లో అతిగా జోక్యం చేసుకోకండి. బద్ధకం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
ధనుస్సు రాశి
ఆశించిన లాభం పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి
ఆకాంక్ష నెరవేరుతుంది. ఉన్నత పదవిలోని వారి అండ లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. బంధువులతో విందులో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
కుంభ రాశి
చిన్నపాటి పనికే అలసిపోతారు. బద్ధకం వీడి కష్టపడితేనే ఆటంకాలను దాటగలుగుతారు. పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. గురు సమానులను కలుస్తారు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు.
మీన రాశి
ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెంచాలి. మీ తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

