విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘VD12’ సినిమా టైటిల్, టీజర్ విడుదలయ్యాయి. మేకర్స్ ఈ సినిమాకు ‘కింగ్డమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టీజర్‌లో విజయ్ దేవరకొండ లుక్, డైలాగ్స్, అలాగే అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరో ముఖ్యమైన ఆకర్షణగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదనపు హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మే 30న గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ కొత్త లుక్, టీజర్‌లోని మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

