Thursday, March 26, 2026
34.2 C
Hyderabad

పన్నులు బాదుడేనా ప్రభుత్వాల పని?|ESSAY|ARTICLES

-పేద, మధ్య తరగతికి భారంగా వాహనాల లైఫ్ ట్యాక్స్

ప్రజల బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు, పన్నుల పేరిట దోపిడి చేయడం దుర్మార్గం. వృత్తి, ఉపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం పెను శాపంగా మారుతున్నది. ఇదే వరుసలో వాహనాల లైఫ్ టాక్స్ పెంచుతూ తెలంగాణ రవాణ శాఖ విడుదల చేసిన 53,54 జీవోలు అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు తీరని నష్టం చేసే విధంగా ఉన్నాయంటూ… సీనియర్ జర్నలిస్ట్, బీసగోని సిద్ధార్థ్ రాసిన ప్రత్యేక వ్యాసం 

ప్రజల బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు, పన్నుల పేరిట దోపిడి చేయడం దుర్మార్గం. వృత్తి, ఉపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం పెను శాపంగా మారుతున్నది. ఇదే వరుసలో వాహనాల లైఫ్ టాక్స్ పెంచుతూ తెలంగాణ రవాణ శాఖ విడుదల చేసిన 53,54 జీవోలు అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు తీరని నష్టం చేసే విధంగా ఉన్నాయి.

ప్రభుత్వాలు నడిపేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. కానీ దానికీ ఒక పరిమితి ఉంటుంది. దేనికైనా ఒక లిమిట్ ఉన్నట్లుగానే, పన్నుల భారం మోసేందుకు ఓ లిమిట్ ఉంటుంది. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్‌, పెట్రోలు-డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీలు, జీఎస్‌టీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇలా అనేక రకాల పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై మరింత భారం వేయడం మూలిగే నక్కపై తాటి పండు పడేసినట్లే.

ఈ రోజుల్లో ఏ చిన్న ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా లక్ష దాటి ఉంటుంది. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారు. తాజా జీవోల ప్రకారం, లక్ష దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ టాక్స్ ను 12శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఉదాహరణకు బైక్ ఎక్స్ షోరూం ధర లక్షా 10వేలు ఉంటే, ఇప్పటి వరకు రూ.13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేది. తాజా పెంపుతో ఇది రూ.16,500 లకు పెరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారం పేద, మధ్య తరగతి ప్రజలపై పడుతుంది.

కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక. అప్పు చేసో, లోన్ తీసుకొనో కొనుగోలు చేస్తుంటారు. రూ.10లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ టాక్స్ వేయడం అంటే ప్రజల కోరికలను సొమ్ము చేసుకోవడమే. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల కారు కొంటే 17శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18శాతానికి పెంచారు. ఉదాహరణకు రూ.12లక్షల కారు కొంటే పాత విధానం ప్రకారం, రూ.2లక్షల 4వేల లైఫ్ టాక్స్ చెల్లించాలి. కానీ పెరిగిన దాని ప్రకారం, రూ.2లక్షల 16వేల దాకా చెల్లించాలి. అంటే రూ.12వేలు ఎక్కువ. రూ.20లక్షలు దాటితే రెండు శాతం, రూ.50లక్షలు దాటితే మూడు శాతం. ఇట్ల అడ్డోగులుగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచారు. రూ.20లక్షల పైగా ఉంటే 20శాతంగా ఉన్న పన్నును 22శాతానికి, రూ.50లక్షలు దాటితే 25శాతం పన్ను కట్టాలని నిర్ణయించారు. కమర్షియల్ వెహికిల్స్ పై పన్ను పెంచడం వల్ల, చివరకు ఆ భారం మార్కెట్ పై, తద్వార ప్రజలపైనే పడుతుంది. ఇట్లా పన్నులు పెంచడం వల్ల ఏవిధంగా చూసినా పేద, మధ్య తరగతి ప్రజలే ప్రధానంగా ఇబ్బంది పడుతారు.

పోనీ, ఇన్ని రకాలుగా పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు కావస్తున్నా, ఇప్పటికీ విద్య, వైద్యం అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కూడు, గూడు దేవుడెరుగు తాగు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితిలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వాలు పెట్టకపోవడం శోచనీయం.

పేద, మధ్య తరగతిపై పన్నుల భారమైనా పడకుండా చూడాలి, లేదంటే అడ్డగోలుగా వివిధ రూపాల పేరిట వసూలు చేస్తున్న పన్నులతో విద్య, వైద్యం, తాగు నీరు, రోడ్లు వంటి కనీస సదుపాయాలైనా పూర్తి స్థాయిలో కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నాం.

– బీసగోని సిద్ధార్థ్
సీనియర్ జర్నలిస్ట్,
ఫోన్: 97042 83062

Latest News

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News