Thursday, March 26, 2026
34.2 C
Hyderabad

రాజకీయ చదరంగంలో అధికారులు పావులా?|POLITICS|ESSAY

రాజకీయ చదరంగంలో అధికారులు పావులా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టితమైనప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికార పోరాటాల మధ్య అధికారుల పాత్ర మరింత సంక్లిష్టంగా మారుతోంది. అధికారుల సమర్థతను, పారదర్శకతను, నిబద్ధతను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. ఇది రాజకీయ చదరంగంలో అధికారులను బలిపశువులా మార్చే పరిస్థితులను కల్పిస్తోంది. దీంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం ఏర్పడుతోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ రాసిన వ్యాసం

రాజకీయ చదరంగంలో అధికారులు పావులా?

భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టితమైనప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికార పోరాటాల మధ్య అధికారుల పాత్ర మరింత సంక్లిష్టంగా మారుతోంది. అధికారుల సమర్థతను, పారదర్శకతను, నిబద్ధతను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. ఇది రాజకీయ చదరంగంలో అధికారులను బలిపశువులా మార్చే పరిస్థితులను కల్పిస్తోంది. దీంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం ఏర్పడుతోంది.
భారతదేశం నాటి రాచరికాల నుంచి రూపాంతరం చెంది, ఇవాళ ప్రజాస్వామ్య పాలనలో విరాజిల్లుతోంది. ఈ వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలుగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ స్వార్థాల కోసం అధికారులను బలిపశువుల వలె మారుస్తున్న దుస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పార్టీల ఆధిపత్య పోరు కారణంగా, రాజకీయ వత్తిళ్లకు గురవడం మాత్రమే కాకుండా, అధికారులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష కొనసాగుతోంది.
ప్రభుత్వంలోని ప్రతి అధికారికీ నిర్దిష్టమైన నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అధికారులు తప్పు చేసినట్లయితే, వారికీ అవసరమైన శిక్షలు, తగిన శాఖాపరమైన చర్యలు తప్పకుండా ఉండాలి. అయితే, రాజకీయ తగాదాలు, స్వార్థపు ధోరణుతో అధికారులపై కక్ష సాధించడం అనేది ప్రభుత్వానికి పాలనకు మేలు చేకూర్చదు. రాజకీయ స్వార్థంతో అధికారులకు పోస్టింగులు కేటాయించడం, వారి పనితీరును నిర్లక్ష్యం చేయడం అనేది చివరకు రాజకీయ సంస్కృతినే దెబ్బతీస్తుంది. అధికారులకు పోస్టింగులు పారదర్శకంగా ఉండాలి. రాజకీయ కక్షలు, ప్రభావాలకతీతంగా అధికారులకు పోస్టింగులివ్వాలి. ఇలా జరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత శక్తివంతంగా పని చేస్తుంది.
ప్రస్తుత ప్రభుత్వ విధానంలో విభాగాల ఆధారంగా, ప్రాంతీయ భేదాలు లేదా సామాజిక వర్గాల దృష్టి కోణంలో అధికారులను నియమించడం ఎంతవరకు సరైనది? చాలా చోట్ల ఇది అవినీతికి, అక్రమాలకు దారితీస్తుంది. పోస్టింగులలో సమానత్వం, పారదర్శకత అవసరం. స్వేచ్ఛ, సమానత్వం పాటిస్తేనే అధికారులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మారుతారు.

ప్రజల పన్నులు, ప్రజల శ్రమ మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తాయి. సమానత, సామాజిక, ప్రాంతీయ న్యాయాలు పాటించపోతే తిరుగుబాట్లు మొదలవుతాయి. ఇవి మాటలతో కాకుండా, కఠినమైన, ప్రజాస్వామ్య పద్ధతుల అమలుతోనే సాధ్యం.
రాజకీయ నాయకులు, అధికారులు ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తూ, స్వార్థం లేకుండా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత శక్తివంతంగా మారుతింది. పోస్టింగులు, అధికారుల నియామకాలు పారదర్శకంగా, న్యాయపరంగా సాగితే, ప్రజాస్వామ్యలో మనం కోరుకున్న సమతుల్యత సాధ్యమవుతుంది.

– బండి సుధాకర్ గౌడ్
టీపీసీసీ అధికార ప్రతినిధి, 99123 71755

Latest News

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News