ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు, రీలు సిన్మాలు సూసేటోల్లం. గా ప్రొజెక్టర్లకు యేలకు యేలు, లచ్చలు కూడా కర్సైతయి. ఇగ గసొంటి కర్సులేవీ లేకుండనే ఇంట్లనే గోడకు యేసుకునే యిదంగా ప్రొజెక్టర్ ను తయారు శేసిండో సిన్నోడు.

గిట్ల గీ బొమ్మల సూపినట్లు.. ఒక గాజు సీసను తీస్కోవాలె. గదానికి సిల్వర్ పేపరును గాపోటువల సూపినట్లే సుట్టాలె. ఇగ గదాన్ని ఓ అట్ట డబ్బకు టేపు పెట్టి గట్టిగ బిగియ్యాలె. గదాన్ని గా గోడకు సూటిగ పెట్టాలె. ఇగ గదాని పక్కన్నే సెల్ పోన్ల బొమ్మను పెట్టి పెట్టాలె. ఇగ గా సెల్ పోన్ల ఆడె బొమ్మలు, గా గాజు అద్దంల కెల్లి రిఫ్లెక్టై, గా గోడ మీద పడి ఆడతయన్నట్లు?! ఎట్లుంది గీ కర్సు తక్కువ శిట్కా ఉపాయం? మీరూ శేసి సూడుండ్లి.

