శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం శుక్లపక్షం
తిధి షష్ఠి సాయంత్రం 04.40 వరకు ఉపరి
సప్తమి
నక్షత్రం కృత్తిక రాత్రి తెల్ల 03.46 వరకు
ఉపరి రోహిణీ
యోగం వైధృతి తెల్ల 03.48 వరకు ఉపరి
విష్కమ్బ
కరణం తైతుల సాయంత్రం 05.52 వరకు
ఉపరి వణజి
వర్జ్యం సాయంత్రం 04.31 నుండి 06.02
వరకు
దుర్ముహూర్తం పగలు 11.36 నుండి 12.24
వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి 01.30
వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05
మార్చి 05 బుధవారం 2025
రాశి ఫలితాలు
మేష
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారడం వల్ల పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథున
దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.
కర్కాటక
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుకుంటారు.
సింహ
సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ చెంతకు వస్తాయి.
కన్య
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం.
తుల
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో గొడవలు తప్పవు.
వృశ్చిక
బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పదోన్నతులు దక్కుతాయి. వ్యాపార వ్యవహారాల్లో అంచనాలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం దక్కుతుంది.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.
మకర
తొందరపాటు పనికి రాదు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో చికాకు తప్పదు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు. బంధువులతో మనస్పర్థలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభ
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకోని మార్పులు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మీన
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం. పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. వివాదాల నుంచి ఉపశమనం దక్కుతుంది.

