మొయ్:-

కావలసిన పదార్ధాలు:-
1.నూనె/ఘీ
2.చక్కెర
3.బెల్లం
4.బియ్యం పిండి 500gm
5.కిస్మిస్
6.కాజు
7.బాదం
తయారు చేసే విధానం:-
ముందుగా స్టౌ మీద ఒక గిన్నె తిస్కోని అందులో కాస్తంత(సరిపడా)నూనె వేసుకొని ,నూనె వేడి అయ్యాక బెల్లం పావు కేజీ వేసి బాగా కలపాలి 5 నిమిషాలు, తరువాత అందులో బియ్యం పిండి 500 కేజీ వేసి నూనె లో బెల్లం పానకం బియ్యం పిండి కి బాగ పెట్టేలా కలపాలి, తరువాత ఈ మిశ్రమానికి సరిపడేలా వేడి చేసిన నీరు కలిపి 5 నిమిషాలు ఈ మిశ్రమాన్ని కలిపి అందులో కాజు, బాదం, కిస్మిస్ వేసి దిపేయాలి..అందరూ మెచ్చే ఎంతో రుచికరమైన బంజారా స్పెషల్ స్వీట్ మోయి రెడీ అయ్యింది.
కుండ చికెన్ కర్రీ:

కావలసిన పదార్ధాలు:-
1.చికెన్ 1 కేజీ
2.నూనె
3.ఉప్పు
4.పచ్చిమిర్చి
5.కరివే పాకు
6.కొత్తిమీర
7.ఉల్లి గడ్డ
8.పుదీనా
9.పసుపు
10.కారం
11.అల్లం వెల్లుల్లి పేస్ట్
12.కొబ్బరి తురుము
13.గరం మసాల
14.ధనియాల పొడి
తయారు చేసే విధానం:-
1 కేజీ చికెన్ తీస్కొని ఒక ప్లేట్ లో , అందులో పసుపు,కారం, అల్లం వెల్లల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు,కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లి గడ్డ(కట్ చేసి పెట్టుకున్న )ఈ అన్నిటినీ వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ముందుగా కట్టెల పోయి మీద ఒక మట్టి కుండను తిస్కిని, అందులో చికెన్ కి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి బాగా కలపాలి,20 నిమిషాలు బాగ ఫ్రై అయ్యాకా,గరం మసాలా, కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి కలిపి పొయ్యి మీద నుండి దింపేయాలి… ఎంతో రుచకరమైన చికెన్ కర్రీ తయారు అయ్యింది.
పంపినవారు :

మాలోతు బుజ్జి
ఘట్కేసర్, రంగారెడ్డి జిల్లా

