Tuesday, March 24, 2026
33.2 C
Hyderabad

ప్రభంజన్ అకాల మరణం… బహుజన సామాజిక ఉద్యమాలకు తీరని లోటు!|PRABHANJAN YADAV

ఆత్మీయ మిత్రుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాధ్యాయి, ‘సి’ హాస్టల్ లో నా పక్క రూమ్ 65 లో ఉండిన బహుజన ఉద్యమకారుడు, సామాజిక తెలంగాణ సాధనసమితి స్థాపించి కడవరకు నమ్మిన ఆశయాల సాధనకు కొట్లాడిన ధీరుడు ప్రభంజన్ కుమార్ యాదవ్. ఆనారోగ్యంతో 64వ ఏట తుది శ్వాస విడిచిండు. 1990వ దశకం ఆరంభంలో ఉస్మానియాలో భాషా శాస్త్రం ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ లో జర్నలిజం చదువుకున్నడు. యాదవ సామాజిక వర్గం నుంచి విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కడమే గొప్ప. అలాంటిది యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులను ఉద్యమాలకు సన్నద్ధం చేసిండు.

కేంద్ర సమాచార శాఖ లో జర్నలిస్టుగా చేరి ఢిల్లీ కేంద్రంగా చాలా ఎండ్లు పనిజేసిండు. ప్రణాళికా శాఖల్లోనూ పనిజేసిండు. అక్కడ ఉన్న కాలంలోనే ఢిల్లీ జేఏసీ లో చురుగ్గా పాల్గొన్నడు. తెలంగాణా ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో తెలంగాణా ఆకాంక్షతో మమేకమై పని జేసిండు. సామాజిక తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసి, బీసీలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిండు. గూడూరు (జనగామ జిల్లా) నుంచి డిల్లీ వరకూ, అక్కడ బహుజన సమాజ పార్టీ నాయకులతో కలిసి నడిచిండు.

గొల్ల కురుమలు గొప్ప సంస్కృతి పేరిట ఆ సామాజిక వర్గం చరిత్రను రికార్డు చేసిండు. అట్లనే భారతి అనే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థితో కలిసి వేపకాయంత నిజం పేరిట గొల్ల కురుమల జీవితాలు వస్తువుగా వెలువడ్డ కథలను సంకలనం చేసిండు. అంతే కాదు విప్లవాలు సృష్టిస్తున్న విగ్రహాలు, నడుస్తున్న చరిత్ర, కాసుల జ్ఞానం, సామాజిక తెలంగాణ తదితర పుస్తకాలను వెలువరించిండు.

ఢిల్లీ నించి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నిజామాబాద్ లోని తెలంగాణా విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో ఆచార్యులుగా పనిజేసిండు. అక్కడ పనిజేస్తున్న కాలంలోనే అంబేద్కర్ నిర్వహించిన ‘మూక్ నాయక్’ పత్రిక శతజయంతి సందర్బంగా(2020లో) అంతర్జాతీయ సెమినార్ ని నిర్వహించిండు. ఆ సెమినార్ లో నేను, రాపోలు ఆనంద భాస్కర్, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నం. మార్గం ఆ సందర్భంగా, సెమినార్ లో ‘పద్మశాలి పత్రిక ప్రారంభానికి 98 ఏండ్లు!’ అనే పరిశోధన పత్రం సమర్పించినట్లు గుర్తు. ఆ సెమినార్ స్ఫూర్తి తోనే నేను జర్నలిస్టుగా, అంబేద్కర్ పుస్తకాన్ని రాసిన. గత 36 ఏండ్లుగా ప్రభంజన్ ప్రయాణాన్ని చాలా దగ్గరగా చుసినాను.

పాశం యాదగిరి, గద్దరన్న, కోదండరామ్, కంచె ఐలయ్యలతో ప్రభంజన్ కలిసి నడిచిండు. నిన్న మిత్రులు చామకూర రాజు, కె.వి. గౌడ్ లు ప్రభంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించిండ్రు. ముక్కులో పైప్ లతో వారితో బాగానే రాతలతో మాట్లాడిండు. ఫొటోలు దిగిండు. కొంచెం కోలుకున్న తర్వాత పలుకరిద్దామని అనుకున్న. ఇంతలోనే ఈ విషాద వార్త. సభలు జరపడంలోనూ, మిత్రులను సభకు సమీకరించడంలోనూ ప్రభంజన్ పూర్తి డేడికేటెడ్ గా పని జేసేటోడు. ఆయన లేని లోటు బీసీ సమాజానికి తీరనిది. ఆయన ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి.

-డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్
జర్నలిజం, చరిత్ర, సాహిత్య పరిశోధకుడు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యుడు
9849220321

Latest News

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 22 నుండి మార్చి 28 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త పనులు చేపట్టే ధైర్యం వస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై చర్చలు...

తీపి రోగమున్నోల్లకు తీపి వార్త!?|ADUGU TRENDS

మధుమేహం, శెక్కెర, షుగర్ పేరేదైనా గదే తీపి రోగం. గా తీపి రోగానికి మందుల్లేక, అదుపు శేయడం అలివిగాక, శానా మంది యమ యాతన పడుతున్నరు. 2022 నాటికే గీ భూమ్మీద 83...

ఆట విడుపుగా సీఈసీ అభిశంసన!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థల పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రధాన ఆధారం. ఇటీవలి పరిణామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల పరిశీలన (సర్) ప్రక్రియ...

21-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి తదియ రాత్రి 02.09 వరకు ఉపరి చవితి నక్షత్రం అశ్విని రాత్రి 02.51 వరకు ఉపరి భరణి యోగం ఐంద్ర రాత్రి 09.07 వరకు ఉపరి వైధృతి కరణం తైతుల పగలు 03.06...

తెలంగాణ బడ్జెట్ 2026-27:సమగ్ర విశ్లేషణ|TELANGANA|BUDGET|ANALYSIS

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఒక సంకల్ప పత్రమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత...

తెలంగాణ బడ్జెట్:సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూ. 3.24 లక్షల కోట్లు|TELANGANA|BUDGET

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. "ప్రజల ప్రయోజనాలే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News