మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి మరణ సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కూడా నిర్వహించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతులుగా పని చేసిన వారి కోసం సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే పరంపర లేదని కొందరు నేతలు చెప్పినప్పటికీ, కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సంతాపం ప్రకటించారని ఆమె గుర్తుచేశారు. ఆ సంతాప సందేశం కూడా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీయే రాశారని అన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

