Friday, September 25, 2026
27.1 C
Hyderabad

మనం EATING|తింటున్నది తిండేనా!?

CARBOHYDRATES|కార్బోహైడ్రేట్లు ఎక్కువ, PROTEINS|ప్రొటీన్లు తక్కువ
మనం పట్టక పోతే అన్నం భరతం
2060 నాటికి రోగాల భారతం
COUNTRY|దేశ ఆదాయంపై ఆనారోగ్య భారం
ముప్పూటలా బువ్వే! ముప్పు తెచ్చేవి అవ్వే!!

ముప్పూటలా బువ్వే! అప్పుడప్పుడూ ఫలహారాలూ బియ్యం పిండివే!! ఏ చిరు తిండైనా బియ్యపు పిండితోనే!!! తింటే అన్నమే తినాలి. లేకపోతే, ఏమి తిన్నా, ఎంత తిన్నా తిన్నట్లే ఉండదు. ఇది సగటు తెలుగు, తెలంగాణే కాదు, ఆ మాటకొస్తే మొత్తం భారతీయుల ఫీలింగే ఇది. అమెరికాలో ఉన్నా, మరే దేశంలో ఉన్నా, మన ఆహారపు అలవాటే అంత? మన డైటే ఇంత? అనేంతగా మారిపోయింది. ఇది మన ఫీలింగే అనుకునేరు, ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్టడీలోనూ ఇదే తేలింది.
మన తినే తిండిలో 67% అన్నమేనట! మొత్తం ఆహారంలో 70% కార్బోహైడ్రేట్లే!! కూరలు, పండ్లు చాలా తక్కువగా తింటున్నమని తేలింది. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు అందక రోగాల బారిన పడుతున్నామట. పైగా కార్పోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని కూడా ఆ స్టడీ తేల్చేసింది.

ఐసీఎంఆర్ స్టడీలో ఏం తేలిందంటే..
తినడమంటే అన్నమే అనేంతగా మారిపోయాం. ఒకప్పుడు అన్నం దొరకక, జొన్నన్నం, జొన్నగటక గుటకలేసిన మన పూర్వీకులు ఇంకా గట్టిగా రాటుదేలి ఉంటే, మనం మాత్రం ఫారం కోళ్ళలా కాస్త కాలు జారి పడితే పుటుక్కుమనేంత సున్నితంగా మారిపోయాయం. ముప్పుటలా బువ్వే తింటున్నాం. డాక్టర్లు మాత్రం, ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే తిండి బ్యాలెన్స్డ్ గా ఉండాలని డాక్టర్లు చెప్తుంటారు. అయినా సరే, మనం మాత్రం అన్నం లేందే గడియ గడవనంతగా ఉండిపోతున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్టడీలో తేలింది ఇదే.
తెలంగాణ ప్రజలు తినే తిండిలో 67 శాతం అన్నమే ఉంటున్నదని ఆ అధ్యయనం తేల్చింది. ఈ స్టడీ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 1.24 లక్షల మంది నుంచి వివరాలను సేకరించింది. నేషనల్ గైడ్‌లైన్స్ ప్రకారం రోజూ 2వేల క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేవలం 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మొత్తం ఫుడ్‌లో 70 శాతం మేర కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని తమ స్టడీలో తేలినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

కొవ్వు కూడా చాలా ఎక్కువే
రాష్ట్రంలో ప్రజలు కొవ్వు కూడా ఎక్కువే తింటున్నట్టు స్టడీలో తేలింది. నేషనల్ గైడ్‌లైన్స్ ప్రకారం 10 శాతం కన్నా తక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సి ఉన్నా, అంతకుమించి 25 శాతానికి పైగా కొవ్వు పదార్థాలు తింటున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రొటీన్లు, విటమిన్లు మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువ
ప్రోటీన్, విటమిన్ల ఫుడ్ కేవలం 10 శాతం వరకే ఉంటున్నదని ఆ స్టడీ తేల్చింది. పండ్లు చాలా తక్కువగా తింటున్నారని పేర్కొంది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి తింటున్నా, ఆశించిన స్థాయిలో లేదని వెల్లడించింది. ప్రోటీన్ కోసం ఎక్కువగా చికెన్‌పైనే ఆధారపడుతున్నారని, పప్పు తక్కువగా తింటున్నారని పేర్కొంది. ఇటీవల పాలు, పెరుగు వాడకం మాత్రం పెరిగిందని వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాల్లో మనకు మించి అన్నం ఎక్కువే
దేశంలో అన్నం ఎక్కువ తింటున్న రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలే టాప్‌లో ఉన్నాయని ఆ స్టడీ తేల్చింది. ఆయా రాష్ట్రాల్లో 99 శాతం అన్నమే తింటున్నారని, ఈ డైట్ బ్యాలెన్స్ మరీ దారుణంగా ఉందని పేర్కొంది.

ఈ రాష్ట్రాలు కొంచెం బెటర్!
మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గోధుమలు, సజ్జలు, జొన్న పిండితో చేసిన రొట్టెలను ఎక్కువగా తింటున్నారని, వాళ్ల డైట్‌లో అదే 80 శాతం వరకు ఉంటున్నదని స్టడీ తేల్చింది.

దేశ ఆదాయంపై ఆనారోగ్య భారం
ఫుడ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల దేశంలో షుగర్, బీపీ, గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ జనాభాలో ఇప్పటికే 12 శాతం మంది షుగర్ బారిన పడ్డారని, మరో 15.4 శాతం మంది ప్రీ డయాబెటిస్ స్టేజీలో ఉన్నారని పేర్కొంది. 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారని, 40 శాతం మంది కుండ పొట్టతో లావెక్కారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 68 శాతం (63 లక్షలు) గుండె, షుగర్ సంబంధిత జబ్బుల వల్లేనని పేర్కొంది. ఈ జబ్బుల భారం దేశ జీడీపీలో 2.5 శాతం అని పేర్కొంది.

2060నాటికి పెను భారం
2060 నాటికి ఈ అన్ బ్యాలెన్స్డ్ ఆహారం వల్ల వచ్చే వ్యాధుల మీదే రూ.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంచనా వేసింది. మరోవైపు దేశంలో 15శాతం మంది సిగరెట్, బీడీ వంటివి తాగుతున్నారని, ఇది ఊర్లల్లోనే ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఊర్లల్లో 16 శాతం మంది ధూమపానం చేస్తుంటే, సిటీల్లో 14 శాతం మంది చేస్తున్నట్టు తెలిపింది. ఇక దేశంలో 15 శాతం మంది మద్యం తాగుతున్నట్టు వివరించింది.

పౌష్టికాహారంపై ప్రభుత్వాలు స్పందించాలి
కేంద్రం సహా రాష్ట్రాల ప్రభుత్వాలు పౌష్టికాహారంపై స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని ఐసీఎంఆర్ సూచిస్తోంది. బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. న్యూట్రిషన్ ఫుడ్ ప్లాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి న అవసరం ఉందని తేల్చి చెప్పింది.

Latest News

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News