Friday, March 20, 2026
31.2 C
Hyderabad

గంజాయి, డ్రగ్స్ మాఫియా మరణ మృదంగం!|EDITORIAL

2016లో డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా సంచలనమైంది. కానీ, అతకంటే సంచలనం డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి, వినియోగం, సరఫరా అని గుర్తించలేకున్నాం. ఇదే ఇప్పుడు దేశంలో మొత్తం సమాజాన్ని క్యాన్సర్ కంటే వేగంగా, నిర్దాక్షిణ్యంగా, నిరపేక్షంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది.
దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న డ్రగ్స్, గంజాయి మాఫియా ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ పరిసరాల్లో ఫాం హౌస్‌ ల్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతుండటం, అందులో ప్రముఖంగా రాజకీయ నేతలు, వ్యాపారులు, సినీ రంగ వ్యక్తుల పేర్లు వినిపించడం విస్మయాన్ని కలిగిస్తోంది.

భారతదేశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదికల ప్రకారం గత ఐదేళ్లలో డ్రగ్స్ కేసులు గణనీయంగా పెరిగాయి. 2019లో దేశవ్యాప్తంగా 59వేల కేసులు నమోదయ్యాయి. 2023 నాటికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. నాలుగేళ్లలో 40% పెరుగుదల కనిపించింది. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల స్వాధీనం కూడా భారీగా పెరిగింది. 2022లో దేశవ్యాప్తంగా 4వేల టన్నులకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 7.7 కోట్ల మంది మాదక ద్రవ్యాలను ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నారని అంచనా. అందులో గంజాయి వినియోగదారులు 3.1 కోట్ల మంది. 18–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2024-25 లో ఏపీ, తెలంగాణ కలిపి 100 టన్నులకు పైగా గంజాయి పట్టుబడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే దేశంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాలు ముందున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గంజాయి (భాం, చరస్) వినియోగం ఎక్కువగా ఉండగా, పంజాబ్ , సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో సింథటిక్ డ్రగ్స్, ఓపియాయిడ్ల (హెరాయిన్) వాడకం, రవాణా ఎక్కువగా ఉంది. 2018 నాటి గణాంకాల ప్రకారం ఢిల్లీ, ముంబై నగరాలు గంజాయి వినియోగంలో ప్రపంచంలోని ప్రధాన నగరాల జాబితాలో ముందున్నాయి. అయితే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాల్లో 70% నుంచి 80% డ్రగ్స్, గంజాయి వంటి మత్తు వల్లేనని తేలింది.

హైదరాబాద్ డ్రగ్స్ రవాణా, వినియోగానికి ప్రధాన కేంద్రంగా మారుతున్నది. తెలంగాణ పోలీస్ గణాంకాల ప్రకారం 2020లో నమోదైన డ్రగ్స్ కేసులు 1,200 కాగా, 2023 నాటికి అవి 2,500 దాటాయి. మూడేళ్ళలోనే రెట్టింపు కేసులయ్యాయి. గంజాయే కాక, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం కూడా పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ గంజాయి సాగు, రవాణాల్లో కీలకంగా మారింది. 2021లో ఏపీలో 1 లక్షా 80 వేల కిలోల గంజాయి స్వాధీనం కాగా, 2023లో అది 2 లక్షల 50వేల కిలోలకు పెరిగింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు గంజాయి సాగుకు కేంద్రాలుగా మారాయి. ఏపీ పోలీసులు గత మూడేళ్ళల్లో5వేలకు పైగా గంజాయి కేసులు నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాలకు, స్కూల్ టీనేజీ లోపు పిల్లలకు విస్తరిస్తుండటం ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ లు భారతదేశాన్ని ట్రాన్సిట్ హబ్‌గా వాడుకుంటున్నాయి. యువతలో, ముఖ్యంగా ఐటీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోని కొంతమందిలో డ్రగ్స్ వినియోగం ఫ్యాషన్‌గా, స్టేటస్ సింబల్ గా మారింది. ఈ దందాగాళ్ళకు రాజకీయ ఆశ్రయం దొరుకుతోంది. తాజాగా ఘటనలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.

మొయినాబాద్ ఫాంహౌజ్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపి పుట్టా మహేశ్‌లు పట్టుబడ్డారు. వారి స్నేహితుడు ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేశ్, నమిత్‌శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. మిగతా నలుగురూ కొకైన్ వాడినట్లు తేలింది. సిమ్లా నుంచి కొకైన్ తెచ్చినట్లు బెంగళూరు కౌషిక్ రవి వెల్లడించాడు. వాళ్ళందరికీ గత కొంతకాలంగా మత్తుమందులు వాడే అలవాటుందని తేలింది.

తెలంగాణలో ప్రత్యేకంగా ఈగిల్ టాస్క్ ఫోర్స్ తో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఏపీలో కూడా డ్రోన్ల సహాయంతో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నా, కొత్త ప్రాంతాల్లో సాగు కొనసాగుతోంది.

డ్రగ్స్ మాపియాని రూపుమాపడానికి సమగ్ర వ్యూహం అవసరం. చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి. యువతలో అవగాహన పెంచాలి. డ్రగ్స్‌ కు బానిసైన వారిని శిక్షించడం కంటే చికిత్స చేయడం ముఖ్యం. డీ-అడిక్షన్ కేంద్రాలను విస్తరించాలి. డ్రగ్స్ ట్రాకింగ్, స్మగ్లింగ్ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలి. రాజకీయంగా ఆశ్రయమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి రాజకీయ నేతలపై బహిష్కరణ, నిషేధం విధించాలి. మెక్సికో మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ నెమెసియో ఒసెగుయెరా అలియాస్‌ ‘ఎల్‌ మెంచో’ ను ఆ దేశమే వెంటాడి చంపాల్సి వచ్చింది.
అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి. డ్రగ్స్, గంజాయి మాఫియా కేవలం నేర సమస్య మాత్రమే కాదు, అది సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సంక్షోభం. తాజా సంఘటనలను హెచ్చరికలా భావించి, ప్రభుత్వాలు, సమాజం కలసికట్టుగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

Latest News

తెలంగాణ బడ్జెట్ 2026-27:సమగ్ర విశ్లేషణ|TELANGANA|BUDGET|ANALYSIS

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఒక సంకల్ప పత్రమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత...

తెలంగాణ బడ్జెట్:సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూ. 3.24 లక్షల కోట్లు|TELANGANA|BUDGET

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. "ప్రజల ప్రయోజనాలే...

20-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి విదియ రాత్రి తెల్ల 04.03 వరకు ఉపరి తదియ నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.02 వరకు ఉపరి అశ్విని యోగం బ్రహ్మ రాత్రి 11.45 వరకు ఉపరి ఐంద్ర కరణం బాలవ...

సినిమా చరిత్ర తత్వదర్శి రమేశ్ బాబు!|ESSAY|H RAMESH BABU|SPECIAL

హెచ్. రమేశ్ బాబుని స్పర్శించడమంటే, తెలంగాణ సినీ చరిత్రను తడమటమే! ఆయనతో మాట్లాడటమంటే భారతీయ సినిమాను వీక్షించడమే!! ఆయనతో గడపడమంటే.. ఒకటా, రెండా.. హిందీతోపాటు అనేక భాషల సినిమాలను దర్శించడమే!!! భారతీయ సినిమా...

పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతోటి పైసల పంటలు!?|ADUGU TRENDS

తెలివున్నోడు ఏడున్నా తేటగనే బత్తడు. మనం ఒల్లు వంచితే మనకు వంగనిదిని ఈ భూమ్మీద ఏముంటది? గదే నిజం సేత్తాండు గీ అన్న. ఇంట్లో ఊకుండక.. సేంద్రీయ పంటల్ని పండిత్తాండు. పాత ప్లాస్టిక్ బకీట్లు,...

ప్రకృతి, జీవతత్వ కాల జ్ఞానమే ఉగాది!|EDITORIAL

ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు. కాల గమన తత్వాన్ని, జీవితత్వాన్ని, జీవిత సత్యాన్ని గుర్తుచేసే ఆత్మపరిశీలన. గతాన్ని గమనిస్తూ, వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తుకు కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఇది...

19-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం ఉగాది నూతన సంవత్సరాది నవారాత్రోత్సవారంభం నింబకుసుమ భక్షణం పంచాంగ శ్రవణం తిధి అమావాస్య ఉదయం 06.53 వరకు ఉపరి శు. పాడ్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి తెల్ల 04.58 వరకు ఉపరి రేవతి యోగం శుక్ల రాత్రి...

శ్రీ పరాభవ నామ సంవత్సర ద్వాదశి రాశి ఫలాలు|UGADI|RASHI PHALALU

మేష రాశి (ఆదాయం:11, వ్యయం:5, రాజపూజ్యం:2 , అవమానం:4): వీరికి సాధారణంగా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే...

జిర్ర పురుగుల పుర్రె తిరిగె శిట్కా!?|ADUGU TRENDS

జిర్ర పురుగులు గదేనుల్లా బొద్దింకలు. గివీటిని సూస్తే కొందరైతే మస్తు భయపడ్తరు. మనింట, వంట గదుల్ని, మన ఆడోల్లని మస్తు ఇబ్బందీ పెట్టే బల్లులు, ఎలుకల లెక్కనే గీ జిర్ర పురుగులు, బొద్దింకలు....

18-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 07.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి తెల్ల 05.27 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం శుభ రాత్రి తెల్ల 04.15 వరకు ఉపరి శుక్ల కరణం శకుని...

సింక్ ను సాఫ్ చేసుడింత అల్కగనా!?|ADUGU TRENDS

అరె, గిది తెల్వక గింత కాలం మస్తు తిప్పలు పడవడ్తిమి. మనం శేతులు, మూతులు, బోల్లు బొచ్చెలు కడిగే, గా సింకు గార పట్టి, గలీజైపోబట్టె. గింత అల్కగైతదని గిప్పుడే తెలిసింది. గిది...

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News