
అరె, గిది తెల్వక గింత కాలం మస్తు తిప్పలు పడవడ్తిమి. మనం శేతులు, మూతులు, బోల్లు బొచ్చెలు కడిగే, గా సింకు గార పట్టి, గలీజైపోబట్టె. గింత అల్కగైతదని గిప్పుడే తెలిసింది. గిది మీరే సూడుండ్రి.
స్ప్రే బాటిల్ ఉంటది గదా? గదాంట్లె కెల్లి ఒక గా పైపుతోపాటే మూతను గిట్ల బైటికి తీయాలె. ఇగ గదాన్ని గా సింకు రంద్రాల్ల పెట్టి, గిన్నన్ని నీల్లు వదిలి, గట్టిగ పట్టుకుని స్ప్రే చేసినట్లు కొద్ది సేపే శేయాలె. ఇక మెల్లె మెల్లెగా గా మురికి మాయమైతది. గంతే.

