Friday, March 13, 2026
35.8 C
Hyderabad

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN

3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION

అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాచ్ మొత్తం భారత్ ఆధిపత్యం ప్రదర్శించగా, బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి భారీ స్కోరు నమోదు చేశారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దాడికి తట్టుకోలేక చివరికి 96 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా భారత్ మరోసారి టీ20 ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో కనిపిస్తూ కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆకట్టుకునే ఫోర్లు, సిక్సర్లు ఉండడంతో ప్రేక్షకులను అలరించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా ఆగ్రెసివ్‌గా ఆడుతూ కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు బలమైన పునాది వేశారు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తన దూకుడును కొనసాగిస్తూ న్యూజిలాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతను కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు దిశగా దారితీశాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవడంతో అభిమానులకు నిరాశ కలిగింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే చెలరేగి ఆడాడు. అతను కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించి భారత స్కోరు మరింత పెంచాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

256 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫిన్ అలెన్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర కేవలం 1 పరుగుతో పెవిలియన్ చేరడంతో కివీస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది.

ఈ సమయంలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేశాడు. అతను కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు ఎదురు నిలవలేక వరుసగా అవుట్ అయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, మార్క్ చాప్‌మన్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరికి న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బంతిని వికెట్ల వైపు విసరగా అది మిచెల్‌కు బలంగా తాకింది. తన బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లు బాదడంతో అర్ష్‌దీప్ సింగ్ కొంత అసహనానికి గురై బంతిని వికెట్ల వైపు కొట్టినట్టు కనిపించింది. దీంతో డారిల్ మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మైదానంలో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లార్చాడు. మిచెల్‌కు క్షమాపణలు చెప్పగా, ఫీల్డ్ అంపైర్ కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను మందలించాడు. అనంతరం ఆ ఓవర్ ముగిసిన వెంటనే అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.

మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ హర్షా భోగ్లే ఈ ఘటనపై ప్రశ్నించగా అర్ష్‌దీప్ సింగ్ తన వివరణ ఇచ్చాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని మిచెల్‌పైకి విసరలేదని స్పష్టం చేశాడు. బంతి రివర్స్ స్వింగ్ కావడంతో అతనికి తగిలిందని తెలిపాడు. ఇప్పటికే మిచెల్‌కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విజయం తమ జట్టుకు ఎంతో ప్రత్యేకమని, కానీ ఈ ఆనందాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందని అన్నాడు. జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఈ విజయం తమకు చిరస్మరణీయమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News