అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు.

గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే, సమాజంల గంత యిలువ అన్నట్లు. పెండ్లంటే ఒక్కసారే జరిగేదని, ఎంత కర్సుకైనా ఎనుకాడ్త లేరు. హరియాణల అంబాలకు శెందిన గురుసేవక్, కర్నాల్ కు శెందిన మనీషతోటి పెండ్లైంది. గా పెండ్లి పొల్లగాని తండ్రి ‘బిడ్దా! నా కోడల్ని గాలి మోటర్ల తీస్కరావాలె!!’ అన్నడట. గంతే, గా పొల్లగాడు గాల్లెగిరే హెలీక్యాప్టర్ ను మాట్లాడిండట. పెండ్లి పిల్లను గండ్లనే తనింటికి తోలుకపోయిండంట. ఇగ సూసినోల్లు నోల్లు ఎల్లబెట్టిండ్లట. ఇగిప్పుడు గిది వైరలైంది. గా సోషల్ మీడియల మస్తు ట్రోల్ శేత్తాండ్లట.!

