గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి నుప్పుదాకా ప్లాస్టిక్ నే వాడబడితిమి. గవాటిని వాడటమే కాదుల్లా, తాగి పడేసిన గా సీసల్ని తెచ్చి, గీయినె ఏకంగా ఇల్లే కట్టిండు.

ముందుగ తాగి పడేసిన సీసల్ని తెచ్చిండు. పొయ్యి మీద ఓ గిన్నెను పెట్టి, గండ్ల గవాటిని యేసిండు. ముందుగనే తయారు శేసిన ఇటికె అచ్చుల.. గా కరిగిన ద్రావణాన్ని పోసిండు. గదాన్ని బోర్లిచ్చిండు. గండ్ల కెల్లి గా ప్లాస్టిక్ ఇటికె తయారైంది. గట్లనే శానా ఇటికెల్ని శేసి, ఏకంగా ఇల్లే కట్టిండు. ఇగ పెద్దగ కర్సే లేకుండ, తయారైన గా ప్లాస్టిక్ ఇటికెల ఇల్లును సూసి ఇచ్చెంత్ర పోతాండ్లు. పొరపాటుననో, గ్రహపాటుననో, ఏమరపాటుననో గా ఇంటికి నిప్పంటుకుంటే. ఏంటి పరిస్థితి? అనేటోల్లు అంటాండ్రు!

