Trending News
Saturday, March 7, 2026
34.3 C
Hyderabad
Trending News

గిది గూడ పుష్పక యిమానం లెక్కనే!?|ADUGU TRENDS

యెనకటికి పుష్పక యిమానం గురించి ఇన్నం. రామాయణంలో యుద్ధం అయిపోయినంక సీతతో కూడి రాముడు సకాలంలో అయోధ్యకి శేరిండంట. గిదీని గురించి మస్తుగ రాసిండ్రు. కనీ, గిట్లాంటిదే యిమానం, యెలికాప్టర్. గివీటికంటే ఇంకా తక్కువ కర్సు, తక్కువ బరువుతోటి ఓ పెద్ద సైజు డ్రోనసొంటి గాల్లో ఎగిరే కరెంటు కిరాయి యిమానాన్ని చైనా తయారు శేసింది.

చైనాకు చెందిన ఆటో ఫ్లైట్ అనే కంపెనీ ఓ అద్భుతం శేసింది. ప్రపంచమంతా ఆశీరపడే యిదంగ అవునా అబ్బురమనిపించే శిన్నపాటి కిరాయి యిమానాన్ని తయారు శేసింది. గిదీనికి మ్యాట్రిక్స్ అనే పేరు పెట్టింది. ఇగ దీని బరువు 5 టన్నులుంటదట. ఒక్కపాలే 10 మంది ఎక్కొచ్చట. ఒక్కపాలి శార్జింగ్ శేస్తే, గంట శేపు గాల్ల పోవచ్చట. ఇగ గిది గంటకు 280కి.మీ. యేగంతో పోతదట. బ్యాట్రీతో నడిశే గిదీని రేంజ్ 250 కి.మీ. ఉంటదట. హైబ్రీడ్ మాడల్ అంటే, పెట్రోలు, బ్యాట్రీ రెండూ ఉండేదైతే, 1,500 కి.మీ. దూరం పోతదట. ఇగ దీనికి గీ మద్దెలనే పరీచ్చలు శేసిండ్లట. గాల్లోకి ఎగరడానికి యిమానాల లెక్క రన్ వే కూడా అవసరం లేదట. నిలబడ్డకానుంచి నిలబడ్డట్లే ఎగురుతదట. గట్లనే దిగుతదట. ఇగ గిది వస్తే మనుషుల పయాణంల మస్తు యిప్లవమే వస్తదట. ఆగుండ్లాంగుండి… గిది మనకు అందుబాట్లకి రావడానికి ఇంకో రెండేండ్లు పడతదట. ఎట్లుంది గీ కొత్త పుష్పక యిమానం? ఎక్కి సూత్తె తెలుత్తది తియ్యిండ్రి.

Latest News

ఏ మానవ కళ్యాణానికి… ఈ మానవ హననం, మారణహోమం?|EDITORIAL

పశ్చిమాసియాలో దద్దరిల్లుతున్న యుద్ధం ఎప్పటికి ముగిసేను? యుద్ధాన్ని రాజేసి, ఆజ్యంపోసిన అమెరికా చెబుతున్నట్లు ఐదారు నెలలు సాగితే, ఇరాన్, ఇజ్రాయెల్ మిగతా మిత్ర దేశాల గతేం కాను? ఈ యుద్ధ ప్రభావంతో విలవిలాడుతున్న...

07-03-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి చవితి రాత్రి 06.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం చిత్త ఉదయం 10.49 వరకు ఉపరి స్వాతి యోగం వృద్ధి ఉదయం 06.40 వరకు ఉపరి ధ్రువ కరణం బాలవ సాయంత్రం 06.30...

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News